calender_icon.png 16 March, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలిమిటేషన్‌పై సర్కారు అడుగులు

16-03-2025 01:38:18 AM

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి భేటీ

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): నియోజకవర్గాల పునర్విభజనపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కార్యాచరణ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనపై ముందస్తుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని గత క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో పాటు ఆ బాధ్య తలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డికి అప్పగించారు.

ఈ నేప థ్యంలో శనివారం జానారెడ్డి నివాసంలో భట్టి, జానారెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు పంపించామని భట్టి ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే తమ ధ్యేయమని వారిరువురు స్పష్టం చేశారు.

అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో ఫోన్‌లో మాట్లాడి.. ఎవరికీ ఇబ్బంది లేని విధంగా సచివాల యం లేదా ప్రజాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేసి, ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఎంతో కీలకమైన ఈ అంశంపై తెలంగాణ సర్కారు అప్రమత్తంగా ఉందని వారు స్పష్టం చేశారు.