01-04-2025 10:07:03 PM
మాజీ ఫ్లోర్ లీడర్ నాగభూషణం...
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పేద ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని రేషన్ షాప్ ల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... రేషన్ కార్డు కల్గిన ప్రతీ లబ్ధిదారునికి ప్రతీ నెల సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తూ తెలంగాణను రోల్ మాడల్ గా తీసుకుంటుందన్నారు. ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజల కోసం పనిచేస్తుందని ప్రజలంతా తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర రావుకు సీఎం రేవంత్ రెడ్డికి మండల, మున్సిపాలిటీ పేదల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పూర్ణచెందర్ రావు, చింత అశోక్ కుమార్, జిల్లా ఆర్టిఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, మున్సిపాలిటీ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ యూత్ అధ్యక్షులు రాందేని చిన్న వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్ట్ తోట రమేష్, మాజీ కౌన్సిలర్ రాందేని వెంకటేష్, నాయకులు అరిగేల చెందు, భూమేష్, అమీర్, హాజీ గోపతి రమేష్, వివిధ వార్డ్ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.