calender_icon.png 1 January, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం బెడ బుడగ జంగం సంక్షేమానికి కృషి చేయాలి

29-12-2024 11:31:52 PM

బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు సాయిలు...

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వం బెడ బుడగ జంగం సంక్షేమానికి కృషి చేయాలని బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు సాయిలు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని కళాశాలలో నిర్వహించిన బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఎస్సీ 56 ఉపకులాలకు జనాభా తమాషా ప్రకారం అందడం లేదని, జనాభా ప్రతిపాదికన న్యాయం జరగాలంటే ఎస్సీ 56 ఉపకులాలు ఐక్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వం బేడ బుడగ జంగం ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని లేని పక్షంలో ఎస్సీ ఉపకులాలను ఏకం చేసి అందరికి సమానమైన న్యాయం జరగడానికి ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంకు పోచయ్య, నారాయణ, టేకు రమేష్, కళ్లెం సాయిలు, అల్లం పండరి తదితరులు పాల్గొన్నారు.