ఎమ్మెల్సీ కోదండరాం
నిర్మల్,అక్టోబర్18(విజయక్రాంతి): దిలావార్‌పూర్ మండల కేంద్రం వద్ద నిర్మిస్లున్న ఇథానాల్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచించాలని ఎమ్మెల్సీ కోదండరాం అ న్నారు. ప్రజలకు హాని కలిగితే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని అన్నారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా దిలావార్‌పూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ అనుమానాలు నివృత్తి చేయక పోగా తమపై కేసులు పెట్టినట్టు ఆయనకు రైతులు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దీ నిపై సమగ్ర అధ్యయనం చేయాలని సూ చించారు. న్యాయబద్ధమైన రైతుల పోరాటా న్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని భరోసా ఇచ్చారు. శాంతియుతంగా తమ నిరసనను తెలుపుకోవాలని సూచించారు.
రైతులపై పె ట్టిన కేసులు ఎత్తి వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేస్తామని అన్నారు. ఇప్పటికైనా రైతులు, ప ర్యావరణవేత్తలతో అధికారుతే సమావేశం నిర్వహించాలని కోరారు. ఉద్యమ నాయకురాలు సంద్య మాట్లాడుతూ న్యాయం జరు గని పక్షంలో రైతులకు అండగా ఉద్యమం చేస్తామని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని రోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, దిలువా ర్పూర్, లోలం, గుండంపల్లి, టెంబుర్ని, బన్సపల్లి, కాండ్లీ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.