calender_icon.png 28 December, 2024 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

01-12-2024 05:59:25 PM

బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య

కాప్రా: వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య డిమాండ్ చేశారు. కాప్రా సర్కిల్ హెచ్ఎంటి నగర్ నాచారంలోని బిఆర్టియు గ్రేటర్ కార్యాలయంలో ఈ మేరకు ఈనెల ఏడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆటో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో బంద్ గోడపత్రికను టిఎడిఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్తిరెడ్డి, టియుసిఐ గ్రెటర్ గౌరవాధ్యక్షుడు లింగం గౌడ్ లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఆటో డ్రైవర్ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. ఈనెల 7వ తేదీన నిర్వహించిన ఆటో బంద్ లో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శాతం రమేష్, హైమద్, అక్కి రామాంజనేయులు, తిరుమల్, కిషన్, శ్రీరామ్, సాయి, మున్నా యాదవ్, కుమార్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.