27-03-2025 08:24:03 PM
కల్లూరు (విజయక్రాంతి): శాసనసభలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నియోజకవర్గంలోని 5 మండలాలో ఒక్క సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోనే డయాలసిస్ సెంటర్ ఉంది. పేషేంట్లు ఎక్కువగా ఉండటం వలన ఆ సెంటర్ సరిపోవడం లేదు ప్రైవేట్ హాస్పిటల్ లకి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాలి అంటే ఖర్చుతో కూడుకున్న పని మద్య తరగతి, పేదరిక డయాలసిస్ బాధితులకు భారం అవుతుంది. పెనుబల్లి, కల్లూరు మండలాల్లో కూడా కొత్తగా 50 పడకల అస్ప్రతి లు ప్రారంబానికి సిద్ధం అవుతున్నాయి. అట్టి వాటిలో కూడా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లయితే పేషేంట్స్ కు ఉపయోగపడుతుందని ప్రభుత్వానికి విన్నవించిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగామయి దయానంద్ కు పాప బత్తిని నగేష్ సత్తుపల్లి నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు ధన్యవాదములు తెలిపారు.