18-02-2025 12:00:00 AM
ఎమ్మెల్యేకు మాలసంఘం నేతల వినతి
ఆదిలాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షీంచాలని ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొప్పుల రమేష్ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ని కలిసి ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ర్ట ప్రభుత్వం పునర్ ఆలోచించేలా ఒత్తిడి తేవాలని కోరుతూ సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత 2014 నుండి 2024 రాష్ర్ట ప్రభుత్వం ద్వారా అమలు చేసిన విద్యా, ఉద్యోగం స్వయం ఉపాధి, దళిత బంధు, దళిత బస్తి, రాజకీయ అన్ని రంగాలలో మాలలకు, మాల ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎస్సీ వర్గీకరణను పునఃసమీక్షించి 2024 జనాభా లెక్కల ప్రకారం మాలలకు న్యాయం జరిగే విధంగా ఎంపారికల్ డాట సేకరించి రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మేకల మల్లన్న, బేర దేవన్న, అశోక్, సుధాకర్, సూరం భగవాన్లు, దాసరి బాబన్న, పాశం రాఘవేంద్ర, రాళ్ల బండి శంకర్, తొగరి ప్రకాష్, పొచ్చన్న తదితరులు ఉన్నారు.