calender_icon.png 29 September, 2024 | 3:55 PM

బాధితురాలికి ప్రభుత్వం కార్పొరేట్ విద్యనందించాలి

29-09-2024 01:54:16 PM

ఎమ్మెల్యే కోవా లక్ష్మి 

రూ,25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి

బాధితురాలి కుటుంబ పరామర్శ

నిందితుడిని కఠినంగా శిక్షించాలి 

బెల్ట్ షాప్ లు  నివారించాలి 

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): అత్యాచారానికి గురైన బాలికకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యను అందించాలని ఎమ్మెల్యే కోగలక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ మైనర్ బాలిక అయినందున పూర్తి బాధ్యత ప్రభుత్వం బాధిత కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ జిల్లాలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని గ్రామాలలో విచ్చలవిదిగా బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల యువత మద్యానికి బానిసై ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం బెల్ట్ షాపులను ఎత్తివేయాలని అందుకు ఎక్సైజ్ , పోలీస్ శాఖలు సమన్వయం చేసుకొని వాటిని నివారణకు కృషి చేయాలన్నారు. బాధిత మహిళా కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.