11-03-2025 01:02:24 AM
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, సలహాదారుల ఆదాయపు పన్నును ప్రస్తుతం ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. క్యాబినెట్ హోదా ఉన్న వారి ఐటీని ప్రభుత్వం చెల్లించకుండా ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ శాం తికుమారికి సోమవారం లేఖ రాశారు. ఆదా యం పన్నును ప్రభుత్వం చెల్లించే పద్ధతిని ఆపాలని సీఎస్‌ను కోరినా ఫలితం లేదన్నారు.