calender_icon.png 27 September, 2024 | 9:47 AM

ఆలయాల్లో ప్రభుత్వం జోక్యం వద్దు

26-09-2024 02:14:30 AM

  1. ప్రభుత్వాలు లౌకికవాద సంస్థలు
  2. మతపరమైన అంశాలను ధార్మిక సంస్థలకే వదిలేయాలి
  3. లడ్డూ కల్తీ విచారకరం, పవిత్రతను దెబ్బదీసే కుట్ర
  4. జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వానంద్ సరస్వతి

సిక్కిం, సెప్టెంబర్ 25: లౌకికవాద సంస్థలుగా చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ మత స్థలాలను ఎలా నియంత్రిస్తాయని జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ ప్రశ్నించారు. లడ్డూ వివాదం అంశాన్ని సైతం మతపెద్దలకే వదిలేయాలని సూచించారు.

అన్ని ఆలయాల కార్యకలాపాలను ధర్మాచార్యులు స్వతంత్రంగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆవుల సం రక్షణ కోసం దేశవ్యాప్తంగా గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర చేపట్టిన శంకరాచార్య స్వామీ జీ.. యాత్రలో నాలుగో రోజు సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో గోధ్వజ స్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిందూ దేవాలయాల నిర్వహణ, భోగ్, పూజ, పం డుగలు తదిత మతపరమైన అంశాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని చెప్పారు.

ఏపీలోని తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై శంకరాచార్య స్వామీజీ ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. లడ్డూ వివాదాన్ని ధార్మిక సంస్థలకే వదిలేయాలని సూచించారు. 

వారు హిందువులు కాదు

యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మంగళవారం పర్యటించిన స్వామీజీ.. ప్రభుత్వాధినేతలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో గోహత్యను నివారించలేని ప్రధాని, రాష్ట్రపతి అసలు హిందువులే కాదని ఆరోపించారు.

ఇప్పటివరకూ అత్యున్నత పదవులను అధిష్ఠించిన వారెవరూ హిందువులు కాదని, అందుకే దేశంలో గోహత్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని విమర్శించారు. యూపీలో సంత్ యోగి సీఎంగా ఉన్నప్పటికీ గొడ్డు మాంసం ఎగుమతులు ఆ రాష్ట్రం నుంచే ఎక్కువగా జరుగుతున్నాయని మండిపడ్డారు. 

లక్నోలో తిరుపతి లడ్డూ వివాదంపై స్పందిస్తూ.. కోట్లాది మంది భక్తులకు గొడ్డు కొవ్వు కలిగి ఉన్న ప్రసాదాన్ని పంచడం విచారకరమన్నారు. ఇది హిందువుల పవిత్రతను దెబ్బతీసే కుట్ర అని ఆరోపించారు. దీనిపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలన్నారు.