01-03-2025 01:29:47 PM
50 తునికి ఆకుల కట్టకు 5 రూపాయలు చెల్లించాలి
పాల్వంచ,(విజయక్రాంతి): తునికి ఆకు సేకరణ కొరకు ప్రభుత్వం వెంటనే టెండర్లను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ టెండర్లు కాంట్రాక్టర్లు వేయకపోతే ప్రభుత్వం తునికాకు సేకరణ చేపట్టాలని సిపిఐ(ఎమ్-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో డివిజన్ ముఖ్య కార్యకర్తలు సమావేశం, కామ్రేడ్ ముసలి సతీష్ అధ్యక్షతన పట్టణంలోని గాంధీనగర్ లో కార్యలయంలో శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ గౌని నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వేసవికాలంలో గిరిజన ప్రజలకు జీవనాధారమైన తునికాకు సేకరణకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం టెండర్లను నిర్వహించి తునికాకు మోడెం కొట్టించాలని(ప్రూనింగ్ పనులు) వారు డిమాండ్ చేశారు.50 తునికి ఆకుల కట్టకు 5 రూపాయలు చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న బోనస్ ను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎస్ కె ఉమర్, జిల్లా,డివిజన్ నాయకులు వెంకటేశ్వర్లు,రాంబాబు, రెడ్డి,రాఘవులు,నాగరాజు,సోమ వినోద,సమ్మక్క,నాగమణి, తదితరులు పాల్గొన్నారు.