calender_icon.png 27 September, 2024 | 10:52 PM

ఉద్యమాకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి

09-09-2024 10:56:58 AM

మంథనిలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు

మంథని (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కళాకారులందరికీ గుర్తింపు కార్డులు, రూ. 20వేలన రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాత్రి మంథని పట్టణములోని పట్టణంలోని  అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు అమరుడైన గూండా నాగరాజు విగ్రహం వద్ద ఆయనకు  నివాళులర్పించారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫారం, చైతన్య యాత్ర ఉద్యమ నాయకులకు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావును, ఇతర ముఖ్య నాయకులను మంథని లో ఉద్యమకారులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చీమ శ్రీనివాసరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 27 తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆరవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆత్మీయ ఘన సన్మాన కార్యక్రమం, వాల్ పోస్టర్ ఆవిష్కరించినట్టు తెలిపారు. ఉద్యమకారులకు,  కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 250గజాల స్థలం, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులను గుర్తించటానికి ఒక కమిటీ వేయాలని

ఉద్యమకారులకు,  కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులను అందజేయాలి, అలాగే ఉద్యమకారులకు కళాకారులకు నెలనెలకు రూ. 20వేల గౌరవ వేతనం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూనె రాజేశం, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్, మంథని మండల అధ్యక్షులు గోగుల రాజిరెడ్డి, నాయకులు రఘోతంరెడ్డి,  కొండెల మారుతి,  విజయ్ కుమార్, జాడి జంపయ్య, వెల్పుల  గట్టయ్య, దేవల్ల  విజయ్, దుబాసి శ్రీనివాస్, బండారి సుధాకర్. మల్యాల రాజయ్య, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.