28-02-2025 07:44:53 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): జహీరాబాద్ గడ్డ పాత పంటలకు అడ్డ అని, ఇన్ని రకాల పంటలు పండించి వాటిని రిజిస్ట్రేషన్ చేయకపోవడం దురదృష్టకరం అటారి జోన్ 10 డైరెక్టర్ డా. షేక్ ఎన్. మీరా అన్నారు. శనివారం జహీరాబాద్ పట్టణ శివారులో ఉన్న డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ - కృషి విజ్ఞాన కేంద్రం అవరణంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, అటారి జోన్ 10 వారి ఆధ్వర్యంలో పంటల రకాలు, రైతుల హక్కుల పరిరక్షణ (పి.పి.వి.యఫ్.ఆర్.ఏ) న్యూ డిల్లి వారి సహకారంతో “పంట రకాల, రైతుల హక్కుల పరిరక్షణపై తెలంగాణలోని కృషి విజ్ఞాన కేంద్రాలకు శిక్షణ, అవగాహన కార్యక్రమం" నిర్వహించారు. మనం కాపాడుకుంటు వస్తున్న పంట రకాలను రిజిస్ట్రేషన్ చేసుకునే అదృష్టం మనకు వచ్చిందదన్నారు.
దాని కోసం పి.పి.వి.యఫ్.ఆర్.ఎ శాస్త్రవేత్తల స్వయంగా ఇక్కడి వచ్చారన్నారు. సంప్రదాయ విత్తనాలను పరిరక్షించకపోతే మనం వ్యవసాయాన్ని కాపాడుకోలేకపోతాము రేపటి రోజు ప్రైవేట్ కంపెనిలు మన దగ్గరకి వచ్చి జన్యూ క్రమం తెలుసుకోనే అవకాశం ఉందన్నారు. పి.పి.వి.యఫ్.ఆర్.ఏలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. జీవవైవిధ్యానికి మారుపేరుగా ఉన్న భారతదేశం అందులో తెలంగాణలో పి.పి.వి.యఫ్.ఆర్.ఏ అప్లికేషన్లు తీసుకోని రిజిస్టర్ చేయడం వల్ల కృషి విజ్ఞాన కేంద్రాలకు కూడా మంచి పేరు వస్తుందదన్నారు. విత్తనాల రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బయో పైరసిని అపవచ్చున్నారు. ట్రేసబిలిటి, క్యూ ఆర్ కోడ్ ద్వారా సేంద్రీయ పంటలను కాపాడాలి, దీనికి కోసం కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు సహాయసహకారాలు అందించలన్నారు.
డా. రామాంజనేయులు మాట్లాడుతూ... డిడియస్ మహిళలు 40 రకాల విత్తనాలను కాపాడుతున్నారని తెలిపారు. 40 రకాల పంటలు పండిస్తున్నారని తెలిపారు. జీవవైవిధ్య జాతరను నిర్వహించి విత్తనాల గొప్పతనాన్ని తెలియచేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన వివిధ జిల్లాల నుండి 16 కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలతో పాటు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా మాజీ ఐ.సి.ఏ.ఆర్ డైరెక్టర్ జనరల్, ప్రస్తుత పి.పి.వి.యఫ్.ఆర్.ఏ చైర్మెన్ డా. త్రిలోచన మహాపాత్ర, పి.పి.వి.యఫ్.ఆర్.ఏ రిజిస్టర్ జనరల్ డా. దినేష్ అగర్వాల్, డిడియస్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ డా. రామాంజనేయులు, డిడియస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. దివ్య, భారతీయ వరి పరిశోధన శాస్త్రవేత్త డా. అరవింద్ కుమార్, చిరుధాన్యాల ప్రధాన శాస్త్రవేత్త డా. హరి ప్రసాద్, ప్రిన్సిపల్ సైటిస్ట్ డా. వి.ఆర్ రెడ్డి, డిడియస్ కెవికె సీనియర్ సైటిస్ట్, హెడ్ డా. వరప్రసాద్ తో పాటు డిడియస్, కెవికె సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.