నిర్మల్ (విజయక్రాంతి): సివిల్ సప్లై గోదాముల్లో పనిచేస్తున్న అమాలి కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆ సంఘం నాయకులు విలాస్ పుండలిక్ తెలిపారు. ఆదివారం నిర్మల్ గోదాం పాయింట్ వద్ద వారు చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. గతంలో హమాలీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కూలీ రేట్లు పెంచాలని భువన సదుపాయని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.