calender_icon.png 28 October, 2024 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు బడిపై చిన్నచూపు పోవాలి

30-08-2024 01:42:27 AM

  1. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి
  2. బొట్టుగూడ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన 

నల్లగొండ, ఆగస్టు 29, (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో చిన్నచూపు పోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి గురువారం మ ంత్రి శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్లతో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సకల వసతులతో పాఠశాలను నిర్మించనున్నట్టు తెలిపా రు. 1952లో ప్రారంభమైన బొట్టుగూడ పా ఠశాలకు ఎంతో పేరు ప్రతిష్ఠలున్నాయని గుర్తు చేశారు.

రాష్ట్రానికి అనేక మంది ఇంజినీ ర్లు, డాక్టర్లు, మేధావులను అందించిన ఈ పాఠశాల అద్దె భవనంలో కొనసాగడం తన ను కలచివేసిందని, అందుకే కోమటిరెడ్డి ప్ర తీక్ కళాశాల తరహాలో దీనిని రాష్ట్రానికే తలమానికంగా నిర్మించేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేసి అందుబా టులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.  

12న మెడికల్ కాలేజీ ప్రారంభం 

నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలను సె ప్టెంబర్ 12న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 350 కోట్లతో స్కిల్ యూనివర్సిటీని ని ర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని తెలిపా రు. నల్లగొండ లోనూ రూ. 20 కోట్లతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అం తకుముందు నల్లగొండ మున్సిపల్ పార్క్ లో ప్రజావాణి నిర్వహించి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో యూరియా కొరత ఉందని డీఏవో శ్రవణ్‌కుమార్ మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే జిల్లాకు 4 వేల మెట్రిక్ టన్నులు పంపించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఫోన్‌లో కోరారు.