calender_icon.png 17 April, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహించాలి

05-04-2025 12:18:54 AM

సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్

వారసిగూడ, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : ప్రభుత్వ స్కూల్‌లను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాల్సి ఉందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. దూద్‌బావిలోని చిలకలగుడా ప్రైమరీ స్కూల్ లో రానున్న విద్యా సంవత్సరానికి ప్రవేశాల కరపత్రాలను పద్మారావు గౌడ్ శుక్రవారం సికింద్రాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్‌లలో వివిధ సదుపాయాలను కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, సికింద్రాబాద్ లో పేద విద్యార్ధులకు ఉపకరించేలా జూనియర్, డిగ్రీ కాలేజీలను సాధించుకున్నామని తెలిపారు. కొత్త భవనాల నిర్మాణా నికి సైతం చురుకుగా ఏర్పాట్లు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సైతం తమ స్కూల్‌లలో విద్యార్థుల సంఖ్య ను పెంచుకొనేందుకు, మెరుగైన ప్రమాణాలకు కృషి చేయాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్ర మంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ పాల్గొన్నారు.