calender_icon.png 30 September, 2024 | 5:56 PM

సర్కారు బడి.. సమస్యల ఒడి

30-09-2024 01:39:10 AM

  1. హైదర్షాకోట్ జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థుల ఇక్కట్లు
  2. 640 మంది విద్యార్థులకు 9 మందే ఉపాధ్యాయులు
  3. బెంచీల్లేక కింద కూర్చుంటున్న విద్యార్థులు

రాజేంద్రనగర్, సెప్టెంబర్23 : సర్కార్ బడులను అన్నివిధాలుగా బలోపేతం చేస్తాం అంటూ ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సరైన వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయు లు ఇబ్బందులు పడుతున్నారు.

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్ జెడ్పీ పాఠశాలలో 640 మం ది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒక్క 8వ తరగతిలోనే 160 మంది విద్యార్థులుండగా అందరినీ ఒకే తరగతి గదిలో ఉంచి పాఠాలు చెబుతున్నారు. కొందరు బెంచీలపై కూర్చుటుండగా మిగతావారు కిందకూర్చుంటున్నారు.

పాఠశాలలో ఉపా ధ్యాయుల కొరత కూడా తీవ్రంగా ఉంది. 18 మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 9 మంది తోనే నెట్టుకొస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

సమస్యలు పరిష్కరిస్తాం

బడిలో మెరుగైన వసతులు కల్పించాం. అదేవిధంగా విద్యార్థుల సంఖ్యనుగుణంగా ఉపాధ్యాయులను నియమిస్తాం. ఉపాధ్యాయుల కొరతపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. మరో వారంలో ఉపాధ్యాయులను భర్తీ చేస్తాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం. 

 రాంరెడ్డి, ఎంఈఓ, గండిపేట