calender_icon.png 11 February, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ కు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

10-02-2025 06:41:01 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని చందాయిపేట్, వడియారం 2024 లో నిర్వహించినటువంటి నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ ఫలితాల్లో మండలంలో ఉన్నటువంటి చందాయిపేట్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మాలోత్ రాహుల్, వడియారం ప్రభుత్వ పాఠశాలకు చెందిన వడ్ల సృజిత్ భార్గవ్, భవాని శ్రీజ, ఎంపికైనట్లు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందాయిపేట్, శ్రీ కిషన్, వడియారం, లీలావతి తెలియజేశారు. విద్యార్థులు స్కాలర్ షిప్ కు ఎంపికైనందుకు, వీరికి సహకరించిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందానికి, ప్రధానోపాధ్యాయులు అభినందించారు.