calender_icon.png 17 October, 2024 | 5:40 PM

పంచాయతీలకు ప్రభుత్వ పాఠశాల అడ్డ కాదు...

17-10-2024 03:32:03 PM

పంచాయతీలు నిర్వహిస్తే కఠిన చర్యలు... 

మంథని ఎస్ఐ రమేష్ హెచ్చరిక 

మంథని (విజయక్రాంతి): మంథని ప్రభుత్వ పాఠశాల పంచాయతీలకు అడ్డ కాదని, ఇకనుంచి ఈ పాఠశాల ఆవరణలో పంచాయతీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంథని ఎస్ఐ రమేష్ హెచ్చరించారు. మంథని ప్రభుత్వ (బాలుర) ఉన్నత పాఠశాలలో  కొంత మంది పెద్దమనుషులు పంచాయతీలు చేస్తున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎస్ఐ రమేష్ పెద్దమనుషులను పంచాయతీ దారులను పిలిచి, ప్రభుత్వ పాఠశాలలో పంచాయితీలు చేయడం ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్యార్థినీ విద్యార్థులకు విఘాతం కలిగుతుందని, ఇక నుంచి ఈ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పంచాయతీలు బంద్ పెట్టాలని, లేకుంటే విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడతారని, పాఠశాల హెడ్‌మాస్టర్‌ సిబ్బందిని పిలిచి పాఠశాల ఆవరణలో పంచాయతీలు నిర్వహిస్తే మీ పై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. దీంతో వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు గేటు మూసి ఇకనుంచి పంచాయతీలకు అడ్డ పాఠశాలను కానీయమని ఎస్ఐ కి హామీ ఇచ్చారు.