calender_icon.png 28 February, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్‌

28-02-2025 01:39:40 PM

కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) కొత్తగూడెంలోని ప్రభుత్వ హైస్కూల్ కూలి లైన్ లో ప్రధానోపాధ్యాయుడిగా విధులు(Headmaster) నిర్వహిస్తున్న మాస్టర్ రవీందర్,రూ. 20వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం పట్టుబడినట్లు ఏసీబీ డిఎస్పి వై రమేష్ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ పాఠశాలకు కరాటే శిక్షణ కొరకు ఇన్స్ట్రక్టర్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అందుకుగాను శిక్షకుడికి రూ 30 వేల మంజూరు చేశారు.

ఈ 30 వేల రూపాయలను శిక్షకునికి ఇవ్వాల్సి ఉండగా అందులో నుండి హెడ్మాస్టర్ రూ 20వేలు రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగిందని, బాధితుడు ఇట్టి విషయంపై ఏసీబీని ఆశ్రయించగా, అధికారులు దాడులు నిర్వహించగా,రూ 20వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు పట్టుబడటం, జరిగింది. ఈ దాడుల్లో ఎసిపి డిఎస్పి వై రమేష్ ఎంతో చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.