calender_icon.png 20 April, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోల్‌లో ప్రభుత్వ బడి వార్షికోత్సవం

18-04-2025 12:00:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 17 : నాగోల్‌లోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా హాజరై మాట్లాడారు.

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉ పాధ్యాయులదేనన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరం గా ఉండి, కష్టపడి చదవాల న్నారు. చదువుల్లో, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీఐ సూర్యనాయక్, చంద్రశేఖర్ ఆజాద్, సత్యనారాయణగౌడ్, కన్నగౌడ్, చిరంజీవిగౌడ్, రవికుమార్, హెచ్‌ఎం లక్ష్మిదేవి, ఉపాధ్యాయులు రవికుమార్, పేరెంట్స్ కట్ట ఈశ్వరయ్య, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు.