calender_icon.png 27 September, 2024 | 6:56 PM

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందాలి

26-09-2024 12:26:15 AM

మంత్రి కొండా సురేఖ

సిద్దిపేట జిల్లా అభివృద్ధ్ది పనులపై అధికారులతో సమీక్ష

సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 25: ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధ్దిదారులకు అందకపోతే అధికారులపై చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో అభివృద్ధి పనులపై శాఖలవారీగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సివిల్ సప్లయ్ అధికారి సమావేశానికి సంపూర్ణ సమాచారంతో రాలేదని ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను మంత్రి అదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించిందని.. మెదక్ ఎంపీ రఘునందన రావు ఆరోపించారు.

జిల్లాలోని మూడు రిజర్వాయర్లల్లో భూ నిర్వాసితులతో పాటు తొగుట మండలం తుక్కాపూర్ గ్రామాస్తులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు. జిలాల్లో రెగ్యులర్ వ్యవసాయ శాఖ అధికారి లేకపోవడం వలన వ్యవసాయ శాఖ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతోం దని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా అందించే రూ.500 చాలామంది లబ్ధిదారుల ఖాతాలో జమ కావాడం లేదని, గతంలో ధాన్యం కొనుగోలు చేసిన కమీషన్ ఇవ్వలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రికి వివరించారు.