21-03-2025 02:00:53 AM
మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మమ్మ
చేవెళ్ల, మార్చి 20(విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి లక్ష్మమ్మ పిలుపునిచ్చారు . గురువారం మొయినాబాద్ మున్సిపల్ పరిధి లోని అజీజ్ నగర్లో జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చే యాలని సూచించారు. ముఖ్యంగా యువ వికాసం, మహిళా సంఘాలకు అద్దె బస్సు లు, రూ.500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ సెక్రటరీ జాను, జనరల్ సెక్రెటరీ రేష్మ బేగం , జిల్లా నాయకులు ముత్యాల పుష్పమ్మ, కమలమ్మ, నియోజకవర్గాలు, మండలాల ప్రెసిడెంట్లు పాల్గొన్నారు.