calender_icon.png 25 October, 2024 | 3:50 AM

ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలి

25-10-2024 01:43:08 AM

పీసీసీ సోషల్‌మీడియా భేటీలో దీపాదాస్ మున్షీ  

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడి యా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సూచించారు. పీసీసీ సోషల్ మీడి యా విస్తృతస్థాయి సమావేశం గురువారం గాంధీభవన్‌లో జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో సాగుతోందన్నారు. పార్టీ అభివృద్ధిలో సోషల్ మీడియా ప్రతినిధులు కీలకపాత్ర పోషిస్తున్నారని అభినందించారు. పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడు తూ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

రాష్ట్రంలో నూ బీఆర్‌ఎస్ కూడా సోషల్ మీడి యా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని విమర్శించారు. ఏఐసీసీ సోషల్ మీడియా చైర్‌పర్సన్ సుప్రియా శ్రీనేట్ మాట్లాడుతూ.. అస త్య ప్రచారాలపై ఎప్పటికప్పుడు స్పం దించి, వాటిని ధీటుగా తిప్పికొట్టాలన్నారు. టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీశ్‌కుమార్, తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆఫరేటివ్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, నాయకులు జగదీశ్వర్‌గౌడ్, గిరిజా శెట్కర్, సూర్యకిరణ్ పాల్గొన్నారు.