calender_icon.png 25 February, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్కీములు కరపత్రాల రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి

25-02-2025 07:04:11 PM

కలెక్టర్ జితేష్ వి పాటిల్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, స్కీములను అన్ని డిపార్ట్మెంట్ల వారు పాంప్లెట్ల రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్, నైపుణ్య కమిటీ చైర్మన్ అయిన జతేష్ వి పాటేల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా నైపుణ్య కమిటీ సమావేశం చైర్మన్ జిల్లా కలెక్టర్, కన్వీనర్ జిల్లా ఉపాధి అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అన్ని డిపార్టుమెంట్స్ వారి వారి విభాగాల్లోని స్కీముల వివరాలు ఒక దగ్గర సేకరించి పాంప్లెట్స్ రూపంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలన్నారు.

అదే విధంగా జిల్లాలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం అభివృద్ధిలో ఉంది కాబట్టి ఆయా రంగాలలో నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించి అనేక డైరీ బై ప్రొడక్ట్స్ పెంపొందిచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. ITDA పరిధిలోని ట్రైనింగ్ సెంటర్ లలో కూడా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వచ్చే సమావేశం నాటికి అన్ని శాఖ అధికారులు పూర్తి స్థాయి నివేదికలతో రావాలని సూచించారు