calender_icon.png 23 April, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి

23-04-2025 12:00:00 AM

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

శంషాబాద్‌లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సమావేశం

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 22 : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత పార్టీ నాయ కులపై ఉందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి లోనిసిద్ధాంతిలో మంగళవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత సిద్ధాంతి చౌరస్తా నుంచిర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. నాయకులు ఇంటింటికి వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని వివరించాలన్నారు. ప్రభుత్వం అమలు పథకాలను జనానికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు వురు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.