27-03-2025 12:33:49 AM
సన్మానించిన టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు
గజ్వేల్, మార్చి26: ప్రభుత్వ పథకాలను రైతులకు వివరించి వారు వినియోగించుకునేలా చూడాలని గజ్వేల్ ఆత్మ కమిటీ నూ తన పాలకవర్గానికి టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు సూచించారు. బుధవారం గజ్వేల్ లో ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి, డైరెక్టర్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడిఏ బాబు నాయక్ బాధ్య తలు అప్పగించగా, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రావు మాట్లాడుతూ నూతన ఆత్మ కమిటీ పాలకవర్గం రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా రైతులు లబ్ధి పొందే విధంగా పనిచేయాలన్నారు.
ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరు మల్లారెడ్డి మాట్లాడుతూ తనకు ఆత్మ కమిటీ అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.
తనపై విశ్వాసం ఉంచి అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుండా నిర్వహించి రైతులకు సేవలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏవో నాగరాజు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆత్మ బిటిఎం ఎటిఎం లు పాల్గొన్నారు.