లబ్ధిదారుల ఎంపికలో ఫిర్యాదులు రావద్దు
నిర్మాణం పూర్తయిన ఈ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలి
తహసిల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్...
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు...
సంగారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులో మంజూరు పథకాలు అర్హులైన పేదలకు అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు(District Collector Kranthi Valluru) అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లాలోని, తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ద్వేషించి కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు తదితర పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఫిర్యాదులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్వేలో పెండింగ్ ఉన్న లబ్ధిదారుల వివరాలు సేకరించి తుది జాబితాను ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. గతంలో నిర్మించి లబ్ధిదారులకు అందజేయని రెండు పడక గదుల ఇండ్లు వెంటనే లబ్ధిదారులకు అందజేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
సంపూర్తి ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రెండు పడక గదుల ఇండ్ల వద్ద అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పరదర్శకతతో జరిగేలా గ్రామాలు వార్డులలో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల వివరాలను చదివి వినిపించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. 2025 జనవరి 26 న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల విజయవంతం కోసం రెవెన్యూ పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఇలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా మానవతా దృక్పథంతో పథకాల ప్రయోజనాలు పేద ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. భూభారతి పోర్టల్ లో నమోదైన పట్టాదారులు మాత్రమే రైతు భరోసా పథకం కింద అందించే ఆర్థిక సహాయానికి అర్హులని కలెక్టర్ స్పష్టం చేశారు.
వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలో ఈ పథకం అమలుకు నోడల్ ఆఫీసర్ల సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. తమ భూములకు సంబంధించి వివరాలను రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉంటుందని ఈ దిశగా ఆలోచన చేయాలని కలెక్టర్ అధికారులు సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకు కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పథకం కింద భూమి లేని పేద వ్యవసాయ కూలీ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేయున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఉపాధి హామీ కింద కనీసం 20 రోజులు పనిచేసిన వారు లబ్ధిదారులుగా గుర్తించాలని కలెక్టర్ సూచించారు. జనవరి 26 నాటికి జిల్లాలోని మున్సిపాలిటీలు అన్ని గ్రామ పంచాయతీలలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావాలన్నారు. అధికారులు పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక జరిగేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
గతంలో అమలుకు మార్గదర్శకాల మేరకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వన్ రేషన్ వన్ స్టేట్ గా రేషన్ కార్డులు జారీ ప్రక్రియలు చేపట్టాలని సూచించారు. వర్గాలకు రేషన్ కార్డుల ద్వారా అందించే ప్రయోజనాలు వారి కుటుంబాలను నిలబెడతాయని ఈ విషయంలో అత్యంత జాగ్రత్తలతో అధికారులు వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేయాలన్నారు. ఈ వీడియో సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, పిడి డిఆర్డిఏ జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, పిడి హౌసింగ్ చలపతిరావు రెవిన్యూ డివిజనల్ అధికారులు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.