కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి
మేడిపల్లి, జనవరి 23(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకే ప్రజాపాలన వార్డ్ సభలు నిర్వహించడం జరుగుతుందని కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ శ్రీ సాయి నగర్ కమ్యూనిటీ హల్ నందు నిర్వహించిన వార్డ్ సభలో ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డు మొదలైన ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంబంధిత దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ త్రిల్లేశ్వర్ రావు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు, డివిజన్,కాలనీ ల అధ్యక్షకార్యదర్శులు, కాలనీ వాసులు,మహిళలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.