ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపాలిటీలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా ఎంపిక జరుగుతుందని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. గురువారం మున్సిపల్ కమిషనర్ మనోహర్ తో కలిసి పట్టణంలోని 9,10,11,12 వార్డులో వార్డు సభలు నిర్వహించి ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. ఆన్లైన్లో తీసుకున్న దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులను పరిశీలించి అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ప్రభుత్వ పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పూటసత్యం, రవి, నిమ్మల రమేష్, శ్రీనివాస్, షబ్బీర్ తదితరులు ఉన్నారు.