calender_icon.png 24 September, 2024 | 3:26 PM

ప్రభుత్వ జీతం.. ప్రైవేట్ వ్యాపకాలు!

24-09-2024 01:30:24 AM

  1. విధులకు డుమ్మా కొడుతున్న హెల్త్ అసిస్టెంట్లు
  2. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలందక రోగుల ఇబ్బందులు
  3. ఉన్నతాధికారులకు గిఫ్ట్‌లు, ముడుపులు?

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్  జిల్లాలో గ్రామీణ స్థాయిలోని పీహెచ్‌సీలలో ప్రభుత్వ వైద్యాధి కారులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అవగాహన లేని ఆర్‌ఎంపీ, పీఎంపీలను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. కొంతమ ంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. తీవ్ర వర్షాల నేపథ్యంలో పారిశుధ్యంపై అవగాహన కార్యక్ర మాలను చేపట్టాల్సిన వైద్యాధికారులు అటు వైపు కన్నెతి చూడడం లేదు.

ప్రభుత్వ జీతం పొందుతూనే రియల్ ఎస్టేట్, చిట్టీల వ్యాపారాలతో పాటు ప్రైవేట్ క్లినిక్‌లు, సిమెంటు దుకాణాలు వంటి వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నారు. మరి కొందరు ఖద్దరు లీడర్ల వెంట తిరుగుతూ పైరవీలు చేసుకుంటూ జిల్లా అధికారులకు, ప్రజా ప్రధినిధు లను బురిడీ కొడుతున్నారు. దీ ంతో ఆసుపత్రుల్లో ఇతరులపై పని భారం పడుతోంది. విధులకు ఎగనామం పెట్టేవారంతా జిల్లా ఉన్నతాధికారులకు బహుమ తులు, ముడుపులు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

టంచన్‌గా నెలజీతం

జిల్లాలోని పాలెం, పెద్దకొత్తపల్లి, పెద్ద కారుపాముల, వటవర్లపల్లి, తెల్కపల్లి, లింగాల, అంబట్‌పల్లి, కోడేర్‌లతో పాటు కల్వకుర్తి, కొల్లాపూర్ పరిధిలోని పీహెచ్‌సీలలో విధుల్లోకి వెళ్లకుండానే నెల జీతం టంచన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. మరికొంత మంది హెల్త్ అసిసెంట్లు అప్పర్ ప్లాట్ (ఏజెన్సీ) ఏరియాలో ఐటీడీఏ వంటి ఇతర వాటిలో ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ పైరవీల పనిలో బిజీగా గడుపుతున్నారని తెలుస్తోంది. అయినా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాబ్ చార్ట్ ప్రకారంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిత్యం ప్రజలకు, రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలను అందించాల్సిన అధికారులు డుమ్మాలు కొడుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడడుతున్నది. 

పైరవీకారులుగా హెల్త్ అసిస్టెంట్లు!

గ్రామీణ ఆరోగ్య కేంద్రాలతో పా టు పల్లె దవాఖానాలు సక్రమంగా న డవాలంటే హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలదే కీలకపాత్ర. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఎన్‌సీడీ, టీకాలు, షుగర్, బీపీ రోగులకు మందుల పంపిణీతో పాటు డ్రైడే వంటి కార్యక్రమాలను పట్టించుకోవడంలేదని ఆయా గ్రామా ల ప్రజలు మండిపడుతున్నారు. పీహెచ్‌సీల పరిధిలోని కొందరు ఉద్యోగు లు రిజిస్టర్‌లో సంతకాలు చేసి జారుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర క్లినిక్‌లు నడుపుకుంటూ ప్రభుత్వ మందులను కూడా వారి క్లినిక్‌లకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణ లు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువశాతం ఖాళీలతో నిరుపేదలకు సరైన వైద్యం అదడంలేదని సతమతమవుతుంటే ఉన్న ఉద్యోగులు కూడా విధులకు హాజరుకాకపోవడంతో ఇత ర సిబ్బందిపై పనిభారం పడుతోంది. 

ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు

రూ.లక్షల్లో ప్రభుత్వ జీతం పొందుతు న్న హెల్త్ అసిసెంట్లల్లో  కొంతమంది ప్రై వేటు ఆరోగ్య కేంద్రాలను నడుపుకుంటున్నట్లు సమాచారం. పెద్దకొత్తపల్లి మండల పరిధిలో పని చేయాల్సిన ఓ హెల్త్ అసిస్టెంట్ ఒక్క రోజు కూడా విధులకు హాజ రు కాకుండా జిల్లా కేంద్రంలో సిమెంట్ వ్యాపారం చేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని పీహెచ్‌సీలో పని చేయాల్సి న  హెల్త్ అసిస్టెంట్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నట్లు తెలుస్తున్నది.

తెల్కపల్లి మండలంలోని ఓ హె ల్త్ అసిస్టెంట్ రెడ్ క్రాస్ సొసైటీ పేరుతో విధులకు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణ లు ఉన్నాయి. మరో హెల్త్ అసిస్టెంట్ కొంతమంది అధికారుల అండతో ప్రైవే ట్ ఆసుపత్రి నిర్వహణలోనే బిజీగా గడుపుతున్నారు. మరొక్కరు ఇతరులకు ఉ ద్యోగాలు ఇప్పిస్తానంటూ దందాలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. విధులకు హాజ రుకాకపోయినా వారికి నెలనెలా జీతం ఎ లా పడుతుండటంతో ఉన్నతాధికారులపై అనుమానాలు పెరుగుతున్నాయి. దీనిపై జిల్లా వైద్యాధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.