calender_icon.png 25 November, 2024 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టివేత

12-08-2024 05:14:11 PM

సిద్ధిపేట్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ  పరిధిలోని ముట్రాజ్ పల్లి చౌరస్తా వద్ద  అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల  ప్రభుత్వ రేషన్ బియ్యన్ని  సోమవారం గజ్వెల్ పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోహిని గడ్డ తండాకు చెందిన బుక్య  TS07UK4638 నెంబర్ గల ఆటోలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, గజ్వేల్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. 

అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లాడుతూ... పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో,పట్టణాలలో ఇసుక అక్రమ రవాణా చేసినా, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టినా, రవాణా గ్యాంబ్లింగ్, పేకాట, గుట్కాలు కలిగి ఉన్నా, రవాణా చేసిన  మరియు మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446,  8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు.