calender_icon.png 16 February, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ల్లాలి

15-02-2025 01:06:05 AM

నారాయణపేట, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేం దుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారుల డైరీనీ జిల్లా కలెక్టర్  స్మితా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్  బెన్షాలోమ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులను అభినందించారు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి , విజయవంతం చేసినందుకు గాను  జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.  శాఖ పరంగా ఏ విధమైన సహకారాన్ని అయిన అందించడానికి ఎల్లపుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ నగేష్, హైమవతి, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.