calender_icon.png 28 October, 2024 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

28-10-2024 04:56:41 PM

ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి 

గజ్వేల్ (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు. సోమవారం మర్కుక్ మండలం అంగడికిష్టాపూర్, శివారు వెంకటాపూర్ గ్రామాలలో గజ్వేల్ ఏఎంసి చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డితో కలిసి ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుందన్నారు. రైతులు ఆడగాలని కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారుల చేతిలో పోసి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే  రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించి సరైన ధరను పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి, ఏపీఎం  ప్రసాద్ రావు, సీసీ కవిత, నాయకులు, రైతులు పాల్గొన్నారు.