17-03-2025 01:36:39 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
కోనరావుపేట, మార్చి16:ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం కోనారావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని రైతు వేదికలో కోనరావుపేట మండల పరిధిలో పలువురుకి మంజూరైనా రూ.8 లక్షల 38 వేల విలువైన చెక్కులను 27 మంది లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని,రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ .10 లక్షల పెంచడం జరిగిందని తెలిపారు..
ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు..ఆరోగ్యపరంగా అత్యవసర చికిత్స నిమిత్తం పలువురి కి ఎల్ ఓ సి లను, అనారోగ్యంతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, వైస్ చైర్మన్ ప్రభాకర్,డైరెక్టర్లు,సీనియర్, నాయకులు రవీందర్, బాపురెడ్డి, నాయకులు పాల్గొన్నారు.