calender_icon.png 23 February, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూడాలి

22-02-2025 01:34:05 AM

కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 21 : ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలాల ను  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు. మండల కేంద్రంలోని రామాలయం గుట్ట ప్రాంతాల్లోని సర్వేనెంబర్ 735,544 లో 125.23 ఎకరాలలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గుట్ట వెనకాల గృహాలు నిర్మించుకొని ఉన్న ఇండ్లను  పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలలో ఇండ్ల నిర్మాణం చేసుకున్న గృహాలను గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు.

ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనం తరం గొల్లపల్లి మండల అబ్బాపూర్ గ్రామం లో  నర్సరీ ఆయిల్ ఫామ్ తోటను అధికారులతో కలిసి పరిశీలించారు. నర్సరీ ఆయిల్ ఫామ్ సాగు వల్ల కలిగే ఉపయోగాలను కలెక్టర్ అధికారులు తెలిపారు. రైతులకు నాణ్య మైన మొక్కలను అందించాలని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట డిఆర్డిఓ రఘు వరుణ్, ఎమ్మార్వో, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.