calender_icon.png 13 February, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి

13-02-2025 06:40:22 PM

విచ్చలవిడిగా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు..

చోద్యం చూస్తున్న అదికారులు..

జేబీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు యెర్రా కామేష్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడాది కాలంగా నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువైందని జైభీమ్ రావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు యెర్రా కామేష్ ఆరోపించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను యదేచ్చగా ఆక్రమించుకుంటూ, అక్రమ వెంచర్లు, అక్రమ అపార్ట్మెంట్లు నిర్మాణాలు చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అదేవిదంగా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రాజకీయ నాయకుల ఒత్తిడితో ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.

పాల్వంచలో కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా సర్వే నెంబర్ 444 లో దానికి అనుభందంగా కొన్ని బై నెంబర్లను తీసుకొని అక్రమ వెంచర్లు వేయడం, చుట్టూ పక్కల ప్రాంతంలో కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకొని అనుమతులు లేని నిర్మాణాలు చేస్తున్నా రెవిన్యూ, మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. గతంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న స్థలాలు ప్రభుత్వ స్థలాలని కూల్చివేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.