calender_icon.png 10 November, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి

17-09-2024 03:31:27 AM

జీపీ కార్యాలయం ఎదుట దుద్యాల గ్రామస్థుల ఆందోళన

కొడంగల్, సెప్టెంబర్16: దుద్యాల మండల కేంద్రంలోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని దుద్యాల గామస్థులు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వంపాలనా సౌలభ్యం కోసం దుద్యాల గ్రామాన్ని మండల కేంద్రం గా ఏర్పాటు చేసిందన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి ఉన్న మిగితా ప్రభత్వ కార్యాలయాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హకీంపేటలో ఏర్పాటు చేయాలని చూడటం సమంజసం కాదన్నారు.

ఈమేరకు ఈనెల 15న ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాం డ్ చేశారు. ఆ ప్రకటనలో దుద్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన..  ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆరోగ్య కేం ద్రం, ఐటీఐ కళాశాలను హకీంపేట గ్రామం లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొందని అన్నారు. ఇష్టానుసారంగా చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి మండల కేంద్రంలోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.