సిద్దిపేట,(విజయక్రాంతి): విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఈఈయూ జాతీయ కార్యదర్శి సుదీప్ దత్త(EEA National Secretary Sudipa Dutta) అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో జరిగిన తెలంగాణ స్టేట్ యునైటేడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయస్ యూనీయాన్ రాష్ట్ర 4వ మహాసభలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో సరైనా పాలసి విధానం లేకపోవడం వల్ల విద్యుత్ వినియోగంలో నష్టం వాటిల్లుతుందన్నారు. చండీగర్‌లో 500 మంది రెగ్యులర్, 500 మంది ప్రైవేటు ఉద్యోగులు పని చేస్తున్నారని దాంతో ఖర్చు అధికమౌతుందని కేంద్ర మంత్రి అమిత్‌షా విద్యుత్ రంగాన్ని కలకత్తా కంపనీకి అమ్మాడానికి ప్రయత్నించిందన్నారు. దాంతో 500 మందికుటుంబ సభ్యులు 5000 మందిగా మారి ఇంటింటికి తిరిగి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు జరిగే నష్టాన్ని వివరించడంతో ప్రజల బాగస్వామ్యంతోనే ప్రైవేటీకరణను రద్దు చేయగలిగిందన్నారు. విద్యుత్ రంగాన్ని దేశంలో బిజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అదాని, అంబానిలకు అప్పగించేందుకు కృషి చేస్తుందన్నారు.
విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ అయితే ఉద్యోగుల కన్న ప్రజలకే అధిక నస్టం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్ సీఎం అదిత్యనాథ్(Uttar Pradesh CM Adityanath) విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టారని, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో సైతం ప్రవేటీకరణవైపు ప్రయాత్నాలు చేస్తున్నారని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి 2000 మెగా వాట్లు అవసరం అయితే బొగ్గు, జలవణరులతో 650 మెగా వాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుందన్నారు. ప్రైవేటు కంపనీల ద్వారా సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు మిగిత విద్యుత్‌ను కొనుగోలు చేస్తుందన్నారు. రెండు సంవత్సరాలలో నిర్మించాల్సిన యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పది సంవత్సారాలుగా నిర్మిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పాలకులు ఏ పార్టీ వారైనా కావోచ్చు వారి స్వార్థం కోసం మాత్రమే పని చేస్తున్నారు. ప్రజలకు అవసరమయ్యే పనులు చేయడం లేదన్నారు. విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఆవుట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.