calender_icon.png 8 February, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సొమ్ము రోడ్ల పాలు

08-02-2025 12:00:00 AM

  1. వేసిన కొన్నాళ్లకే పాడవుతున్న రోడ్లు
  2. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లకు వరం
  3. అధికారుల తీరుపై ఎమ్మెల్యే గాంధీ ఆగ్రహం

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నా రు స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ. సీసీ రోడ్లు, బాక్స్ నాళాలతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే ఇంజనీ రింగ్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అత్యా శ ప్రజలకు శాపంగా మారుతుంది.

కోట్లాది రూపాయలు వెచ్చించి చేపడుతున్న సీసీ రోడ్లు నాణ్యతా లోపంతో మట్టికొట్టుకు పోతున్నాయి. వేసిన కొద్ది రోజులకే పాడై పోతున్నాయి. శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో వేసిన రోడ్లలో నాణ్యత లోపి స్తు న్నా ఇంజనీరింగ్ అధికారులు కాంట్రా క్టర్లకు కొమ్ముకాయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాసిరకంగా రోడ్ల నిర్మాణం...

శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలోని ఆయా డివిజన్ల పరిధిలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో మధ్యలో నిలిచిన సీసీ రోడ్లు, బాక్స్ డ్రైనేజీ పనులు ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఈ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు సరైన నా ణ్యతాప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతి గా పనులు కొనసాగిస్తున్నట్లు గత కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీసీ రోడ్లను వేయాల్సిన పరిమాణంలో వేయ కుండా, సిమెంట్, కాంక్రీట్, ఇసుక సరైన పరిమాణంలో వాడకుండా సీసీ రోడ్లను వేస్తున్నారని, సిమెంట్ కు బదులు ఎక్కువగా రాక్ డస్ట్ ను వాడుతున్నారన్న విమర్శ లు ఉన్నాయి. ఇవన్నీ తెలిసినా ఇంజనీరింగ్ అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. రోడ్లు వేసే సమయంలో ఆ వైపునకు వెళ్లకుండా గుత్తేదారుల ఇష్టానికి వదిలేస్తున్నారు. 

అధికారుల నిర్లక్ష్యం..

రోడ్లు వేసేప్పుడు పనులను పర్యవేక్షిం చాల్సిన అధికారులు కిందిస్థాయి సిబ్బందికి వదిలేస్తున్నారు. ఆ తర్వాత కూడా నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు వెళ్లడం లేదని తెలుస్తుంది. గుత్తేదారుల ఇష్టారా జ్యంగా మారింది. అధికారులు కూడా ఆమ్యామ్యాల కు అలవాటు పడి చోద్యం చూస్తున్నారని, తమను అడిగే వారెవరు అన్న రీతిలో వ్యవ హరిస్తు న్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

రోడ్లు వేసిన తర్వాత నాణ్యతా పరీక్షలు నిర్వ హించి, మెజర్మెంట్ చేసి బిల్లులు చెల్లించాలి. కానీ శేరిలింగంపల్లి, చం దానగర్ జంట సర్కిళ్లలో అవేమీ పట్టించు కోవడం లేదని ఇంజనీర్లు ఎంబీలు క్లియర్ చేసి బిల్లు లు చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ఎమ్మెల్యే మండిపాటు...

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇటీవ ల చేపట్టిన సీసీ రోడ్లు నాసిరకంగా నిర్మిం చడంపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించిన రోడ్లు నాసిరకంగా ఉండడం వల్ల 6 నెలల లోపే దెబ్బతింటున్నాయని, చాలా ఇబ్బం దులకు గురవుతున్నామని, అటు ప్రజాధ నం దుర్వినియోగమవుతుందని మండిపడ్డా రు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారికి మళ్ళీ పనులు అప్పగించ కూడదని సూచించారు.

ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

పాడవుతున్న రోడ్ల వల్ల ట్రాఫిక్ సజావుగా సాగడానికి అంతరాయం కలిగించడమే కాకుండా, ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఇలాంటి రోడ్లపై ప్రయాణించేటప్పుడు దెబ్బతిన్న వాహనాల నిర్వహణకు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

- మహేష్ చారి (ప్రయాణికుడు)

ప్రభుత్వం పూర్తిగా విఫలం

మేము పన్నులు చెల్లిస్తాము, కానీ ప్రభుత్వం మాకు సురక్షితమైన రోడ్లను అందించడంలో విఫలమైంది. ఎక్కడ చూసినా ఒక్క రోడ్డు బాగాలేదు. దుమ్ము కొట్టుకుపోయి, గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం నిద్ర మత్తు వదిలి తక్షణ చర్యలు చేపట్టాలి.

- బజార్ఘట్ రమేష్ ప్రెసిడెంట్ గ్రేటర్ హైదరాబాద్ ఎచ్.ఆర్.ఎస్ జే.సి