06-03-2025 05:01:24 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): కళాశాల విద్యా కమీషనర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు పరిశోధన విలువలు పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలకు చెందిన తెలుగు, గణితం విభాగాల విద్యార్థులు హైదారాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గోన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ మహాత్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ మహాత్మా మాట్లాడుతూ.... తెలుగు ప్రాజెక్ట్ కి అధ్యాపకుడు డా.తన్నీరు సురేష్, గణిత ప్రాజెక్ట్ కు అద్యాపకురాలు స్వప్న సూపర్ వైజర్లుగా వ్యవహరించగా విద్యార్థులు శైలజ, విజయ్, తిరుపతమ్మ, లక్ష్మి, శ్రీనివాస్ తెలుగు సాయి, వర్షిణి, రజని, లక్ష్మి, శ్రీనాథ్ లు గణితం ప్రాజెక్టులను ప్రజెంటేషన్ చేసారన్నారు. తెలుగు జిజ్ఞాస పోటీలు బుధవారం గణితం పోటీలు గురువారం నిర్వహించగా ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రాజెక్ట్ లో ఆధునిక సమాజం, మానవ జీవితంలో, పరిశోధనలో వస్తున్న మార్పులను పి.పి.టి. ద్వారా మోడల్స్ ద్వారా యూనివర్సిటీ నుండి వచ్చిన సెలక్షన్ కమిటీకి వివరించడం జరిగిందన్నారు.
ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా వచ్చిన జాయింట్ డైరెక్టర్ యాదగిరి విద్యార్థుల ప్రతిభను మెచ్చుకొని సర్టిఫికెట్లు ప్రధానం చేస్తారన్నారు. జిజ్ఞాస కో ఆర్డినేటర్ జాడి శంకరయ్య, సూపర్ వైజర్ లు డా తన్నీరు సురేష్, స్వప్న, బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులకు అభినందనలు తెలిపారు.