calender_icon.png 17 October, 2024 | 8:52 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

17-10-2024 03:07:34 AM

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తాం

జిల్లాలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

సంగారెడ్డి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని, దీనిలో భాగంగానే రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

బుధవారం ఆయన సంగారెడ్డి పట్టణంతో పాటు పుల్కల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. తొలుత చౌటకూర్ మండలం శివంపేటలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారు. పుల్క ల్ మండలంలోని బస్వాపూర్ చౌరస్తాలో సర్కార్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నదన్నారు.

సంగారెడ్డి పట్టణంలో రూ.2.5 కోట్లతో కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవనం నిర్మిస్తామన్నారు. జిల్లాలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో మంత్రి ట్రాఫిక్ పోలీసులకు కొత్త వాహనాలు అందజేసి మాట్లాడారు. కార్యక్రమాల్లో ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ చెన్నూర్ రూపేశ్ పాల్గొన్నారు.