calender_icon.png 16 January, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

06-09-2024 01:12:46 AM

  1. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 
  2. సింగూరు ప్రాజెక్ట్ నుంచి జలాలు విడుదల

సంగారెడ్డి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి గురువారం ఆయన స్పిల్ వే గేట్ల ద్వారా దిగువకు జలా లు విడుదల చేసి మాట్లాడారు. జల విద్యుత్ కేంద్రంలోనూ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించమన్నారు. ప్రాజెక్టు వద్ద సందర్శలకు సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం మంత్రి పుల్కల్ మండ లంలోని బసవపూర్ మోడల్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. టీచర్స్ డే వేడుకలో పాల్గొన్నారు. కలెక్టర్ క్రాంతి వల్లూర్, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.