27-03-2025 04:47:52 PM
అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రికి నలుగురు స్పెషలిస్ట్ లు
సూపర్డెంట్ రాధా రుక్మిణి..
అశ్వారావుపేట (విజయక్రాంతి): ప్రైవేట్ ఆసుపత్రులకి దీటుగా అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యం అందించేందుకు గైనకాలజిస్ట్, ఎనిష్టియా, పెడిట్రిషన్, ఆర్థో విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్యులు విధుల్లో చేరారని ఆసుపత్రి సూపర్టెండెంట్ డాక్టర్ రాధ రుక్మిణి తెలిపారు. స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకరంతో, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో, DCHS రవి బాబు కృషితో స్పెషలిస్ట్ వైద్యులను తీసుకువచ్చారనీ ఆమె తెలిపారు. వచ్చిన స్పెషలిస్ట్ వైద్యులు ఎప్పుడు హాస్పిటల్ లో అందుబాటులో ఉంటారనీ తెలిపారు.