* ప్రతి మండలంలో నమునా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాలి
* గ్రామ పంచాయతీల పని తీరుపై సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జనవరి-2 (విజయక్రాంతి): ప్రజలకు గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలె క్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో గ్రామ పంచా యతీల పని తీరు పై జిల్లా కలెక్టర్ సంబం ధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే, జాతీయ ఉపాధి హా మీ పనులు, గ్రామాలలో పారిశుధ్య నిర్వహ ణ, డంపింగ్ యార్డ్, విద్యుత్ సరఫరా పను లు, గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధత వంటి పలు అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రతి మండలంలో ఉపాధి హామీ పనుల్లో లేబర్ టర్న్ ఔట్ పెంచాలని, ఉపా ధి కార్మికులకు కూలీల చెల్లింపు సకాలంలో జరిగేలా చూడాలని, కూలీల చెల్లింపులు ఎటువంటి సమస్యలు రావద్దని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. గ్రామాలలో నూతనంగా నిర్మాణం అవుతున్న ఇండ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐ.హె.హె.ఎల్) మంజూరు చేయాలని తెలిపారు.
గ్రామాలలో పారిశుధ్య నిర్వహణపై మండల పంచాయతీ అధికారు లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. గ్రామాలలో చెత్త అధికంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, రోడ్ల పై ఎక్కడా చెత్త, ప్లాస్టిక్ ఉండకుండా పంచాయతీ కార్య దర్శులను బాధ్యులను చేయాలని, ప్రతి రోజు మల్టి పర్పస్ వర్కర్లతో రోడ్లు శుభ్రం చేయించాలని, పారిశుధ్య పనులను నిరం తరం తనిఖీ చేయాలని, ప్రతి రోజు గ్రామాల లో జరిగే పారిశుధ్య పనులు తనిఖీ చేస్తూ సిబ్బంది అటెండెన్స్ వేయాలని, సంక్రాంతి నాటికి పరిస్థితులు మారాలని అన్నారు.
ఎంపిఓలు అధికంగా గ్రామాలను తనిఖీ చేయాలని, సదరు తనిఖీ వివరాలతో నివేది క అందించాలని, గ్రామాలలో ఉన్న సెగ్రిగే షన్ షెడ్ పని తీరు పరిశీలన కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారికి తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలలో నర్సరీ లలో బ్యాగ్ ఫీలింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయా లని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూ చించారు. ప్రతి గ్రామంలో ఉన్న విద్యుత్, త్రాగు నీటి సమస్యల వివరాలను వచ్చే శని వారం నాటికి జిల్లా పంచాయతీ అధికారికి అందించాలని ఎంపిడిఓ లకు సూచించా రు.
జాతీయ ఉపాధి హామీ క్రింద గ్రామాల లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబం ధించి చెల్లింపులు సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పంచా యతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్దం కావాల ని, ప్రతి గ్రామంలో సర్పం, ఉప సర్పం, వార్డు సభ్యులకు పోలింగ్ కు అవసరమైన పోలింగ్ కేంద్రాలు, అవసరమైన సిబ్బంది మొదలగు వివరాలను సరి చూసుకోవాలని, ప్రజా పాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తుదారుడి ఇంటి కి వెళ్లి ప్రస్తుత స్థితి గతి తెలిసేలా ఫోటో యాప్లో అప్లోడ్ చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను సూచిం చారు.
ప్రతి మండలంలో నమూనా ఇందిర మ్మ ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని గుర్తించి పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పం చాయతీ అధికారి వీర బుచ్చయ్య, జడ్పి సీఈఓ నరేందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, సం బంధిత అధికారులు పాల్గొన్నారు.