03-04-2025 08:57:31 PM
సత్తుపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవనంకు సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులకు సహకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకి, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
నర్సింగ్ కాలేజీ నిర్మాణం చేపట్టటం ఎంతో సంతోషంగా వుంది అని, అందరు మంచిగా విద్యారంగంలో రాణించి జీవితంలో స్థిరపడాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్బాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మాజీ కౌన్సిలర్స్ తోట సుజాల రాణి, కంటే నాగలక్ష్మి, గ్రాండ్ మౌలాలి, దూదిపాల రాంబాబు, నాగుల్ మీరా, పద్మ జ్యోతి, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, దొడ్డా శ్రీను, చల్లగుళ్ల కృష్ణారావు, ఇమ్మనేని ప్రసాద్ రావు, కమల్ పాషా, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, సత్తుపల్లి మండలం, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు, పట్టణ వాసులు పాల్గొన్నారు.