- కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, కాలువలు, నాలాల భూములు
- స్వాధీనానికి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు
- రాజకీయ నాయకులు, అవినీతి అధికారుల పరస్పర ఒప్పందాలతో.. రెచ్చిపోతున్న అక్రమార్కులు
- కుంటలను సైతం లెవెల్ చేసి వెంచర్లు వేసి అమ్ముకుంటున్న వైనం
నిజామాబాద్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో చెరువులు కుంటలూ నిజాంసాగర్ కాలువలు కనుమరుగయ్యాయి ప్రభుత్వ భూముల్లో ఆసైన్డ్ భూములలో వెంచర్లు వేసి ఎంచక్కా ప్లాట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటు న్నారు. బడా బాబులు మొదలుకొని రాజకీయ నాయకులు అండదండలు అధికా రుల పూర్తి సహకారం అధికారుల భాగస్వా మ్యంతో ఈ తతంగం అంతా నడుస్తోంది
నిజామాబాద్ నగరంలోని పెద్ద పెద్ద నాళాలు కాలువలు వదలకుండా అక్రమా ర్కులు నిర్మాణాలు చేపట్టి కమర్షియల్ గాను డొమెస్టిక్ గాను వాడుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాతో పాటు నగర కేంద్రంలో కూడా అక్రమ భవనాలు కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించారు. ఏకంగా మురికి కాలువలు పై స్లాబులు వేసి మరీ నిర్మాణాలు చేపట్టారు.
ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని పలు జిల్లాలను సూచిస్తూ జాబితాను ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వం రూపొందించిన ఈ జాబితాలో నిజామాబాద్ జిల్లా ఉండడం విశేషం.
గత ప్రభుత్వ బడా నాయకులు అండదండలతో రెచ్చిపోయిన అనుచర గణం అడ్డగోలుగా కబ్జాలకు పాల్పడ్డారు వాగులు వంకలు వంతెనలు మొదలుకొని చిన్న గుంటలను సైతం కబ్జా చేశారు. ముందుగా మొరం వేసి కొద్ది రోజులు అలాగే వదిలేసి ఆ తర్వాత ఆ స్థలం మాది మొరం మేమే వేశామంటూ ఏకంగా కట్టడాలు మొదలుపెట్టారు. వీరి దుశ్చర్యకు వర్షాకాలంలో నీళ్లతో కలకలలాడే వాగులు, వంకలు, కాలువలు కనుమరుగైపోయాయి.
చెరువులు కుంటల ఆక్రములతోపాటు నాళాలపై కట్టడాలను ప్రభుత్వ భూములలో వెంచర్లు లేఅవుట్లు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకొని అక్రమాలను తొలగించాలని ఆదేశంలో పేర్కొన్నారు
నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్లో తో పాటు వివిధ మండల కేంద్రాలలో అధికా రులు కబ్జాలను గుర్తించి మార్కింగ్ చేయాలని ఇలా యంత్రాంగానికి ప్రభుత్వం నుండి సూచనలు అందాయి. తెలంగాణలో పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాలో అక్రమ వెంచర్లు గొడుగుల్లా వెలిశాయి. 15% కు పైగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలను చేపట్టారు.
కొన్ని ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను ప్రజాప్రతినిధులు అడ్డుకోగా జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో నాయకులు అండదండలతో అపార్ట్మెంట్లు కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టారు. నిజామా బాద్ నగరంలోని బుధం చెరువు అర్సపల్లి రాముడు చెరువు లలో కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములు ఇరిగేషన్ భూములలో అక్రమార్కుల కట్టడాలు వెలిసి వారి కబ్జాలోకి వెళ్లాయి.
గతంలో సతీష్ పవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామడు చెరువును కబ్జా చేసి పెట్రోల్ బంకు నిర్మించాలని నిర్ణయాన్ని చకచకా సాగు తున్న పనులను. ప్రాణాలకు సైతం తెగించి రాముడు చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని అప్పటి మున్సిపల్ బిజెపి కౌన్సిలర్ గౌరారం గంగమ్మ ఆందోళన పాటు నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగించి నిర్ణయం మార్చుకునేలా అధికార యంత్రాం గం పై ఒత్తిడి తెచ్చారు.
తదనంతరం ఈ సంవత్సరాలు కబ్జా చేయడానికి ఎవరు సాహసించలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అక్రమార్కులు అక్రమ నిర్మాణాలు విద్యా సంస్థలు నిర్మించి యదేచ్ఛగా తమ కార్య కలాపాలు కొనసాగిస్తున్నారు. నిజాంసాగర్ కెనాల్ తో పాటు వాటర్ డిస్టిబూటర్లు మచు కకైనా కనిపించకుండా పోయాయి.
ప్రస్తుత మార్కెట్ ధరలో కోట్లాది రూపాయలు పలికే భూములు అన్యాయక్రాంతమ య్యాయి నిజామాబాద్ జిల్లాలో 250 ఎకరాలకు పైగా నిజాంసాగర్ కెనాల్ కు సంబంధించిన భూములు కబ్జా అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో యదేచ్చగా రెచ్చి పోతున్న భూ బకాసురులు రెవెన్యూ అధికా రులను తమ అక్రమ భూ వ్యాపారాలలో వాటా లిస్తూ యదేచ్ఛగా వెంచర్లు వేసి తమ ప్లాట్ల దందా కొనసాగిస్తున్నారు
దశాబ్దాల చరిత్ర గల నిజామాబాద్ పులాంగ్ వాగును సైతం వదలకుండా కబ్జా చేశారు. కులాంగు వాగులోకి చొచ్చుకుపోయి మరీ కట్టడాలు వలిసాయి. జిల్లా యంత్రాంగం స్పందించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో ఏకకాలంలో దాడులు జరిపి అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడవలసిన అవసరం ఉంది.
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలి
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపి కబ్జాకు గురైన కుంటలు చెరువులు, నాళాలు ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పై ఉంది. చెరువుల కాల్వల నాళాల స్థలాలు మేరకు ఉండేది ఇప్పుడు ఎంత మిగిలాయి మిగిలిన భూమి కబ్జాలకు గురికాకుండా ప్రభుత్వ స్థల సూచికలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పై ఉంది అక్రమార్కుల కబ్జా బాగోతంపై పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం పేసి నుండి జిల్లా యంత్రాంగానికి ఆదేశాల అందాయి. ఈ మేరకు అధికారులు దాడులు నిర్వహించి కబ్జా భూములను స్వాధీనం చేసుకొని గట్టి నిగా పెట్టవలసిన అవసరం ఉంది.