- కబ్జాకోరల్లో ప్రభుత్వ భూములు
- నిజామాబాద్‌లో రెచ్చిపోతున్న అక్రమార్కులు
నిజామాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): నిజామాబాద్ నగర శివారుల్లోని ప్రభుత్వ భూములు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. ప్రభత్వ భూమి ఖాళీగా కనిపిం చిదంటే చాలు ఆ స్థలంలో మొరం వేసి కొన్ని రోజులు అలాగే ఉంచుతారు. ఆ తర్వా త మరో ముఠా రగంలోకి దిగి, కబ్జా చేస్తుం ది. ముందుగా ఒకరిపై రిజిస్ట్రేషన్ చేసి, ఆ వ్యక్తి మరొకరికి అమ్మినట్లు డాక్యుమెంట్లు సృష్టిస్తారు. నిజామామాద్‌లోని నాగారం ప్రాతంలో ఐదువేల ఎకరాలకుపైగా ప్రభు త్వ భూమి ఉంది.
గత 19 సంవత్సరాలు క్రితం బీడీ కార్మికులకు బీపీల్ కింద గృహ సముదాయలను నిర్మించి ఇచ్చారు. అక్కడ కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ నగరపాలక సంస్థ నుంచి కార్పొరేషన్ స్థాయి లభించడంతో ఈ కాలనీల్లో 10, 11 మున్సిపల్ డివిజన్లు ఏర్పడ్డాయి. దీంతో కాలనీల్లోని ఖాళీ స్థలాలపై కబ్జాదారుల కన్నుపడింది. రాజకీయ నేతల అం డతో అమాయకులకు చెందిన ప్లాట్లతో పా టు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు.
అవినీతి అధికారుల సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూముల అమ్మకాలు చేపడుతున్నారు. భూమి తమదని ఎవ రైనా వస్తే వారిని బెదిరంచడమే కాకుండా దాడులకు తెగబడుతున్నారు. రాజకీయ అం డతో అక్రమ కేసుల్లో ఇరికించి వేధింపులకు పాల్పడుతున్నారు. దొంగ పట్టాల ద్వారా బ్కాంకుల నుంచి రుణాలు తీసుకోవడం లే దా ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకోవడం ఈ భూకబ్జాముఠాలకు వెన్నతో పెట్టిన విద్య.
బొందెం చెరువు భూమిలో ప్లాట్లు
బొందెం చెరువు శిఖం భూమిని ప్లాట్లుగా మార్చిన కొందరు అక్రమార్కులు అమాయకులకు అంట్ట కంటి డబ్బులు దండుకు న్నారు. ప్లాట్లు కొన్నవారు ఇండ్లను నిర్మించుకున్నారు. అయితే అక్రమార్కులకు డబ్బు పంపకాల్లో తేడా రావడంతో ఈ ప్లాట్లపై పరస్పరం రెవన్యూ అధికారులు ఫిర్యాదులు చేసుకున్నారు. గత ఆగస్టు నెలలో విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు బేస్‌మీట్ స్థాయిలో ఉన్న 40కి పైగా నిర్మాణాలను కూల్చి వేశారు.
దీంతో బాధితులు కలెక్టర్ వద్దకు పరిగెత్తి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను మోసం చేసిన అక్రమా ర్కులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీం తో ఓ మహళా కార్పొరేటర్ భర్తతో పాటు ఐదుగురిపై 5వ ఠాణాలో కేసు నమోదయింది. ఈ ముఠాలకు రెవెన్యూ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు కూడా సహకరించినట్లు విచారణలో స్పష్టం అయింది.
అర్సపల్లిలో అక్రమార్కుల పాగా
నగరంలోని అర్సపల్లిలో 15 సంవత్సరాల క్రితం 1,660 ఇళ్ల స్థలాలను అప్పటి ప్రభుత్వం పేదలకు ఇచ్చింది. అయితే కబ్జా రాయుళ్లు.. రాజకీయ నాయకులకు బినామీగా ఉండి తమ అనుచరగణంతో ఇక్కడ స్థలలాను కబ్జా చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఖాళీ స్థలాల్లో పాగా వేసి బోగస్ పట్టాల దందా కొనసాగిస్తుండటంతో ముఠాపై గతంలో కేసు నమోదయ్యింది. అయితే ముఠా నుంచి అప్పటి పోలీస్ కమిషనర్‌కు భారీ ఎత్తున ముడుపులు ముట్టడంతో కేసు అటకెక్కింది.
ఆ తర్వాత వచ్చిన మరో అధికారి అక్రమార్కులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దీంతో భూ కబ్జాదారులతోపాటు వారికి సహకరిస్తున్న రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారుల వెన్నులో వణుకుపుట్టింది. రాజకీయ నాయకులతో పాటు అధికారులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి విచారణ జరుపుతున్న సమయంలోనే ఆ పోలీస్ కమిషనర్ బదీలీ కావడం గమనర్హం.
నా భూమి నాకు ఇప్పించండి
నాపేరు అదే ప్రవీణ్. 2002లో నాగా రం ప్రాతంలో 386 గజాల స్థ లాన్ని కొన్నాను. దానికి లింక్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. కరోనా సమయానికి ముందు నా ప్లాటు వద్ద చదును చేయడాని వెళ్లాను. అక్రమార్కులు వచ్చి నన్ను భయ భ్రాంతులకు గురిచేసి నా భూమి తాలుకు నకిలీ డాక్యుమెంట్ సృష్టించి భూమి వారిదంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. నిలదీస్తే నాపై దాడికి యత్నించారు.
అక్రమార్కులకు రెవె న్యూ, మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారు. నా పేర పట్ట ఉన్న భూమిలో ఇతరుల పేరు మీద నిర్మాణానికి అనుమతి ఎలా వచ్చిం దంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. కబ్జాదారుల మామూళ్లకు అలావాటు పడిన పోలీసులు వారికే వత్తాసు పలికారు. ఇటువైపు రావొద్దని నాకు ఉచిత సలహా ఇచ్చారు. గత 18, 19 సంవత్సరాలుగా నా ప్లా టు విషయమై అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ జరిపి నా స్థలాన్ని నాకు ఇప్పించాలి.
అదె ప్రవీణ్, బాధితుడు