24-02-2025 06:28:31 PM
యూసీసీఆర్ఐ (ఎం.ఎల్) జిల్లా కార్యదర్శి అంబాల మహేందర్...
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియాలో గల 104 సర్వేనెంబర్ లోని ప్రభుత్వ భూమిని కాపాడాలని యుసిసిఆర్ఐ (ఎం.ఎల్) జిల్లా కార్యదర్శి ఆంబాల మహేందర్ సోషల్ మీడియా వేదికగా సోమవారం అధికారులను కోరారు. సర్వేనెంబర్ 104 లోని కోట్లాది రూపాయల విలువ గలప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని ఆరోపించారు. స్థలంతో పాటు పలుచోట్ల ప్రభుత్వ భూములను దొంగ పత్రాలు సృష్టించి కబ్జాలకు తెగబడే ప్రయత్నాలు కూడా జరిపారని ఆయన ఆరోపించారు.
సామాన్య, మధ్యతరగతి ప్రజలు చిన్నపాటి నిర్మాణాలు జరుపుకుంటే అడ్డుకునే అధికారులు భూకబ్జాల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్, రెవిన్యూ అధికారులు కబ్జా భూముల చుట్టూ కంచెలు నిర్మించాలని కోరారు. పక్కా భవనాలు లేని హాస్టళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించాలని కోరారు. అధికారులు ప్రభుత్వాసులను పరిరక్షించాలని లేనట్లయితే పేదలతో ఎర్రజెండాలు పాతిమరి కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచుతామని అధికారులను హెచ్చరించారు.