calender_icon.png 2 March, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమిని పరీరక్షించాలి

01-03-2025 09:58:07 PM

బిఎస్పి చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని ప్రభుత్వ భూములను అక్రమార్కులు, రీయల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి కాపాడి విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని బహుజన సమాజ్ పార్టీ (Bahujan Samaj Party) చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్(BSP Chennur President Mulkalla Rajendra Prasad) డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ సభావత్ మోతిలాల్ నాయక్(Joint Collector Sabavat Motilal Nayak)కు వినతి పత్రం అంద చేశారు. ఈ సందర్బంగా ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... మండలంలోని మందమర్రి శివారు సర్వే నంబర్ 364 లో ఎకరం 30 గుంటలు భూమి రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూమిగా ఉందన్నారు. సదరు ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ వేసి ప్లాట్లుగా చేసి అమ్మకాలు జరిపారని వెల్లడించారు. అదే వెంచర్లో కొన్ని సంవత్సరాల క్రితం  ఫామ్ హౌస్ నిర్మించినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారని ఆరోపించారు. సదరు ప్రభుత్వ భూమిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమంగా చేపట్టిన  నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే పట్టణంలో అనుమతి లేకుండా వెలుస్తున్న అక్రమ వెంచర్లపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు విఫలమైతే బీఎస్పీ ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు వేముల వీరేందర్, దాగామ శ్రీనివాస్, కుమ్మరి కృష్ణ చైతన్యలు పాల్గొన్నారు.